Header Banner

మదీనా నుండి స్వగ్రామానికి! టీడీపీ అండగా విజయవాడకు తరలించిన మహిళా మృతదేహం!

  Wed Mar 05, 2025 10:08        Others

ఇస్లాం పుణ్యక్షేత్రమైన సౌదీ అరేబియాలోని మదీనాలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అనేక మంది ముస్లింల విశ్వాసం. మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో మరణించే యాత్రికులకు స్థానికంగా ఖననం చేస్తారు కానీ వారి స్వదేశాలకు మృతదేహాలను తరలించడానికి ఇష్టపడరు, మదీనా నుండి ముస్లింల మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం అనేది చాలా అరుదైన విషయం.

ఇస్లాం తీర్థ యాత్రకు మదీనా పుణ్యక్షేత్రానికి వచ్చిన ఒంగోలుకు చెందిన ఆబిదా సుల్తానా అనే మహిళ ఆనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఫిబ్రవరి 21న మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వంత ఊరు తీసుకెళ్ళడానికి కుటుంబం చాల కష్టపడింది. ఈ కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచింది. ఎన్నారై వ్యవహారాల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు టీడీపీ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ గార్లు ఆ కుటుంబానికి అండగా నిలవడం చాల ఊరట కలిగించింది.

 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు చప్పిడి రాజశేఖర్ గారి సూచన మేరకు సౌదీ అరేబియా లో నివసిస్తున్న జానీ బాషా మరియు ముజ్జమ్మీల్ షేఖ్ లు ఆసుపత్రి, పోలీసు, పాస్ పోర్టు, కాన్సులేట్ మరియు ఎయిర్ లైన్స్ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆబిదా బేగం మృతదేహాన్ని ఆదివారం గల్ఫ్ ఎయిర్ లైన్స్ విమానం ద్వార విజయవాడకు పంపించడం జరిగింది.

ఈ సందర్భంగా అబిధా సుల్తాన్ పార్థీవ దేహాన్ని సౌదీ అరేబియా నుండి వారి స్వగృహానికి తరలించడానికి మానవతా దృక్పథంతో, ప్రతిఫలాపేక్ష లేకుండా కృషి చేసిన వీరందరికీ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరపున, ఎన్ఆర్ఐ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారి తరపున మరియు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ తరఫున ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #TDP #NRI_TDP #ChandrababuNaidu #HumanityFirst #AbidaSultana #SaudiArabia #Madina #TDPHelp #KondapalliSrinivas #ChappidiRajasekhar #TeluguCommunity